తెలంగాణలో కొత్తగా 983 కరోనా పాజిటివ్ కేసులు
- August 03, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 983 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 67,660కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 1019 మంది కోలుకుని డిశ్చార్జ్ అవగా.. మొత్తంగా..48,609 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం తెలంగాణలో 18,500 యాక్టివ్ కేసులున్నాయి. కాగా నిన్న కరోనాతో 11 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తంగా 551 మంది మృతి చెందారు. ఇంకా 1,414 రిపోర్టులకు సంబంధించిన ఫలితం తేలాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా GHMC-273, రంగారెడ్డి-73, కరీంనగర్-54, మేడ్చల్-48, పెద్దపల్లి-44, నిజామాబాద్-42, సంగారెడ్డి-37, నాగర్‌కర్నూలు-32 కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!







