మహిళాసాధికారతలో సౌదీ మరో కీలక నిర్ణయం..
- August 04, 2020
సౌదీ అరేబియా:మహిళాసాధికారత దిశగా ఇప్పటికే పలు సంచనాత్మక నిర్ణయాలు తీసుకున్న సౌదీ ప్రభుత్వం..వాటి కొనసాగింపుగా మరోసారి మహిళలకు ప్రాధాన్యం కల్పించింది. ఈ సారి దేశ సంస్కృతిక వారధులుగా అవకాశం కల్పించింది. గల్ఫ్, అరబ్ దేశాలతో పాటు పలు మిత్ర దేశాల్లో తమ దేశ నాగరికత, సంస్కృతి ఔనత్యాన్ని చాటుతూ..ఆయా దేశాలతో సమన్వయం, సంస్కృతిక సంత్సంబంధాలు నెరవేర్చటంలో కీలక పాత్ర పోషించే సంస్కృతిక వారధులను సౌదీ ప్రకటించింది.
యునైటెడ్ కింగ్డమ్ కు డాక్టర్ అమల్ ఫతాని, ఐర్లాండ్ కు డాక్టర్ ఫహ్దా అల్-షేక్, ఈజిప్ట్ కు డాక్టర్ అహ్మద్ అల్-ఫరీహ్, జోర్డాన్ కు డాక్టర్ ఇస్సా అల్- రోమైహ్, కువైట్ డాక్టర్ సాద్ అల్-షబానా, మొరాకోలో డాక్టర్ యూస్రా అల్-జజైరిని తమ దేశ సంస్కృతిక వారధులుగా నియమించింది సౌదీ ప్రభుత్వం. అయితే..ఇందులో మహిళలకు ప్రధాన్యం కల్పిస్తూ ముగ్గురికి అవకాశం కల్పించటం విశేషం. ఈ నియామకాలతో సౌదీ ప్రభుత్వం మహిళా సాధిరికతకు, దేశ నిర్మాణంలో అన్ని రంగాల్లోనూ మహిళలకు ఇస్తున్న ప్రధాన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష