కరోనా కేసుల నమోదు వివరాల ప్రకటనను పునరుద్ధరించిన ఒమన్

- August 05, 2020 , by Maagulf
కరోనా కేసుల నమోదు వివరాల ప్రకటనను పునరుద్ధరించిన ఒమన్

మస్కట్:ఒమన్ లో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల నమోదు వివరాలను మళ్లీ అధికారికంగా ప్రకటించనున్నట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నేటి(ఆగస్ట్ 5) నుంచి ప్రతి రోజు దేశంలో నమోదయ్యే కోవిడ్ 19 కొత్త కేసులను ఏ రోజుకు ఆ రోజు ప్రజలకు తెలియజేయనున్నారు. గతంలో ఈ విధానం అమలులో ఉన్నా..ఈద్ సందర్భంగా జులై 31 నుంచి ఆగస్ట్ 4 వరకు కొత్తగా నమోదైన కేసుల ప్రకటించటాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఈద్ ముగియటంతో ఆగస్ట్ 5 నుంచి కరోనా కొత్త కేసుల నమోదు వివరాలను ప్రకటించనున్నట్లు ఒమన్ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com