ఆగస్ట్ 31 వరకు ఇండియా-యూఏఈ ట్రావెల్ కారిడార్ పొడిగింపు

- August 05, 2020 , by Maagulf
ఆగస్ట్ 31 వరకు ఇండియా-యూఏఈ ట్రావెల్ కారిడార్ పొడిగింపు

యూఏఈ:భారత్-యూఏఈ మధ్య తాత్కాలిక విమాన ప్రయాణాల గడువును ఆగస్ట్ 31 వరకు పొడిగించినట్లు యూఏఈలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ముందస్తుగా నిర్ణయించిన ప్రకారం జులై 12 నుంచి 26 వరకు మాత్రమే రెండు దేశాల మధ్య ప్రత్యేక విమాన సర్వీసులకు అనుమతించిన విషయం తెలిసిందే. అయితే..యూఏఈకి వెళ్లాలనుకునే వారు ఇంకా భారీ సంఖ్యలో ఉండటంతో ప్రత్యేక విమాన సర్వీసులను ఆగస్ట్ 31 వరకు పొడిగించినట్లు యూఏఈలోని భారత రాయబారి పవన్ కపూర్ స్పష్టత నిచ్చారు. గత నెలలో నడిపిన విమాన సర్వీసుల ద్వారా రెండు వారాల్లోనే 23,000 వేల నుంచి 25,000 మంది యూఏఈ రెసిడెన్సీ వీసాదారులు భారత్ నుంచి తరలివెళ్లినట్లు ఆయన వెల్లడించారు. అయితే..యూఏఈ వెళ్లాలనుకునేవారు భారత్ లో ఇంకా ఎంతమంది ఉన్నారనేది స్పష్టత లేదని..ఇది విమాన సర్వీసుల కొనసాగింపుపై గందరగోళానికి దారితీస్తోందిని పేర్కొన్నారు. అయితే..యూఏఈ అధికారవర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ప్రయాణ అనుమతులు పొందిన వారి సంఖ్య 25,000 నుంచి 30,000 వరకు ఉందన్నారు. దీంతో ఆగస్ట్ 31 వరకు రెండు దేశాల మధ్య 600 నుంచి 700 వరకు విమాన సర్వీసులను నడిపిస్తున్నామని, అవసరం అనుకుంటే ఇంకా పెంచుతామని రాయబార కార్యాలయం వెల్లడించింది. ఇంకా కొందరు యూఏఈ వీసాదారులు తిరిగి యూఏఈ వెళ్లేందుకు సరైన అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారి..ప్రస్తుతం అలాంటి వారి సంఖ్య ఎంతవరకు ఉండొచ్చనే అంశంపై ఫోకస్ చేసినట్లు తెలిపింది. ఒకవేళ యూఏఈకి తిరిగిరావాలనుకునే వారి సంఖ్య పెరిగితే ఆగస్ట్ 31 తర్వాత కూడా ఇరు దేశాల మధ్య తాత్కాలిక విమాన సర్వీసులను కొనసాగించే అవకాశాలు లేకపోలేదని రాయబారి పవన్ కపూర్ అన్నారు. అయితే..కమర్షియల్ ఫ్లైట్స్ విషయంలో మాత్రం ఇప్పుడప్పుడే పునరుద్ధరించే అవకాశాలు లేవని కూడా ఆయన స్పష్టతనిచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com