కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు:ఈడీ అదుపులో ముగ్గురు కీలక నిందితులు
- August 05, 2020
కేరళ: భారత దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ముగ్గురు కీలక నిందితులను ఈడీ తన కస్టడీలోకి తీసుకుంది. వీరిని ఏడు రోజుల పాటు విచారించేందుకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. కస్టడీకి వెళ్లిన వారిలో సరత్ పీఎస్, స్వప్నా సురేశ్, సందీప్ నాయర్ ఉన్నారు. కాగా ఇదే కేసులో నిందితులను ఈ నెల 21 వరకు జ్యుడీషియన్ కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంపై ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు కూడా విచారణ చేపట్టారు. గత నెల 5న తిరువనంతపురం అంతర్జాతీయ విమనాశ్రయంలో ఓ దౌత్య సంబంధిత బ్యాగులో రూ.15 కోట్ల విలువైన బంగారం పట్టుబడడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటి వరకు కేంద్ర దర్యాప్తు అధికారులు 15 మందిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?