తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు
- August 05, 2020
హైదరాబాద్:ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వచ్చాయి.వస్తూనే ఉన్నాయి.హైదరాబాద్ నగరం ఐటి హబ్ గా మారుతున్నది.కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతున్నది.తెలంగాణలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ అవకాశాలు రావాలని కేబినెట్ అభిప్రాయపడింది. స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని కూడా కేబినెట్ నిర్ణయించింది.
అంతేకాదు,రాష్ట్రంలో పెరిగిపోతున్న వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగం పెంచాలని, ఆ దిశగా ప్రజలను ప్రోత్సహించాలని, ప్రత్యేక రాయితీలు ఇచ్చి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.దీంతో పాటుగా కేబినెట్ కొత్త సెక్రటేరియట్ భవనాల డిజైన్ కు ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?