భారత్-కువైట్ మధ్య త్వరలో తాత్కాలిక విమాన సర్వీసులు ప్రారంభం
- August 06, 2020
కువైట్ సిటీ:భారత్-కువైట్ మధ్య తాత్కాలిక విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి ఇరు దేశాల విమానయాన సంస్థలు విమాన సర్వీసుల షెడ్యూల్ పై ఓ ప్రకటన విడుదల చేసే ఛాన్సుంది. ప్రస్తుత కరోనా నేపథ్యంలో మార్చి నుంచి ఇరు దేశాల మధ్య విమాన రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. గత ఐదు నెలలుగా భారత్ కు రావాల్సిన వాళ్లు కువైట్ లో...కువైట్ తిరిగి వెళ్లాల్సిన వారు భారత్ లో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలోనే తాత్కాలిక విమాన సర్వీసులను నడిసేందుకు రెండు దేశాల విమానయాన సంస్థలు సిద్ధమవుతున్నాయి. కువైట్ నుంచి కువైట్ ఎయిర్ వేస్, జజీరా ఇండియాకు విమానాలను ఆపరేట్ చేయనుంది. కువైట్ ఎయిర్ వేస్ 300 సీట్ల కెపాసిటీతో, జజీరా 200 మంది ప్రయాణికులతో ఇండియాకు విమానాలను నడపనుంది. అదేసమయంలో భారత్ కు చెందిన ఎయిర్ లైన్స్ కూడా కువైట్ తరహాలోనే విమానాలను నడపనుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..