నేటి నుండి ఆన్‌లైన్ లో శ్రీవారి కల్యాణోత్సవం టికెట్లు
- August 06, 2020
తిరుమల:తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతి రోజు నిర్వహించే శ్రీవారి కల్యాణోత్సవాన్ని భక్తుల కోరిక మేరకు ఆగస్టు 7వ తేదీ శుక్రవారం నుండి ఆన్ లైన్ విధానంలో నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా శ్రీ వారి కళ్యాణోత్సవాన్ని భక్తులు తమ ఇళ్ళ నుండి ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించడం ద్వారా కల్యాణోత్సవ సేవలో ప్రత్యక్షంగా పాల్గొన్నామన్న భావన కలుగుతుంది. ఆగస్టు 7 నుండి 31వ తేదీ వరకు కల్యాణోత్సవం టికెట్లు ఆగస్టు 6వ తేదీ, గురువారం ఉదయం 11.00 గంటల నుండి ఆన్ లైన్‌లో భక్తులకు అందుబాటులో ఉంటాయి.
టికెట్లు కావలసిన గృహస్తులు టిటిడి వెబ్‌సైట్www.tirupatibalaji.ap.gov.in లో తమ వివరాలు పొందుపరచి, టిటిడి నియమ నిబంధనలకు లోబడి గేట్‌వే ద్వారా రూ.1000/- చెల్లించి ఆన్‌లైన్ రశీదు పొందవచ్చు. శ్రీవారి ప్రసాదాలను పోస్టల్ శాఖ ద్వారా టిటిడి ఉచితంగా అందిస్తుంది.
స్వామివారి కల్యాణోత్సవం ప్రతి రోజు మధ్యాహ్నం 12. గంటలకు ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. పాల్గొనే గృహస్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి, అర్చక స్వాముల సూచనల మేరకు తమ గోత్ర నామాలతో సంకల్పం చెప్పాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో టికెట్లు పొందిన గృహస్తుల పేరు, గోత్ర నామాల ప్రతిని అర్చకులు స్వామివారి మూల విరాట్టు పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహిస్తారు.
ఈ సేవలో పాల్గొనే భక్తులకు ఉత్తరియం, రవిక, అక్షింతలు ప్రసాదంగా పోస్టల్ శాఖ ద్వారా గృహస్తుల చిరునామాకు పంపడం జరుగుతుంది. భక్తులు టికెట్లు బుక్ చేసుకునేందుకు www.tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ కు లాగిన్ అవ్వాలని సూచించింది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







