అజ్మన్ పబ్లిక్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం..125 షాపులు దగ్ధం

- August 06, 2020 , by Maagulf
అజ్మన్ పబ్లిక్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం..125 షాపులు దగ్ధం

యూఏఈ:అజ్మన్ పబ్లిక్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 125 షాపులు దగ్థం అయ్యాయి. అదృవశాత్తు ఎవరికి ప్రాణనష్టం సంభవించలేదు. ప్రస్తుతానికి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అజ్మన్ పోలీస్ అధికారి వెల్లడించారు. ప్రమాదం సంభవించిన అజ్మన్ పబ్లిక్ మార్కెట్ కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా గత నాలుగు నెలలుగా మూతపడి ఉంది. అయితే..ప్రమాదం ఎలా జరిగిందోగానీ, మార్కెట్లో ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ విషయం ఆపరేషన్స్ కార్యాలయానికి సాయంత్రం 6.30 గంటలకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే మూడు నిమిషాల వ్యవధిలోనే 4 ఫైర్ స్టేషన్ల నుంచి సహాయక బృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. మంటలు పెద్దఎత్తున చెలరేగటం..మార్కెట్లు అగ్నిప్రమాదానికి దోహదం చేసే గూడ్స్ ఉండటంతో సహాయక బృందాలు అప్రమత్తమై మార్కెట్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఆ వెంటనే ముందుజాగ్రత్తగా సమీప ప్రాంతంలోని బిల్డింగ్ లను ఖాళీ చేయించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఐదుగురు మహిళలతో సహా 96 మంది అగ్నిమాపక సిబ్బంది ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సివిల్ డిఫెన్స్ యూనిట్స్ తో పాటు 25 మంది పోలీసులు అంబులెన్స్ వాహనాల విభాగం సిబ్బంది వేగంగా స్పందించినట్లు అజ్మన్ పోలీసులు వెల్లడించారు. అయితే..ప్రమాద కారణాలను తెల్సుకునేందుకు విచారణ చేపట్టామని వివరించారు.అజ్మాన్ రూలర్ గురువారం ఉదయం ఆ స్థలాన్ని సందర్శించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com