మార్కెట్లోకి ఫావిపిరవిర్ 400mg..
- August 07, 2020
న్యూ ఢిల్లీ:కరోనా రోగులకు చికిత్సలో భాగంగా ఉపయోగించే ఫావిపిరవిర్ ఔషధాన్ని గ్లెన్‌మార్క్ ఫార్మా తొలుత 200 ఎంజీ డోసుకు తీసుకువచ్చింది. తాజా ఈ ఔషధాన్ని 400 ఎంజీ డోసుల్లో తీసుకువచ్చింది. ఈ మందు వాడిన వారు త్వరగా కోలుకుంటున్నట్లు ఫార్మా కంపెనీలు చెబుతున్నాయి. కోవిడ్ బాధితులు మొదటి రోజు 9 ట్యాబ్లెట్లు వేసుకోవాలని, ఆ తరువాతి రోజు నుంచి తగ్గేవరకు రోజుకు 4 ట్యాబ్లెట్లు వైద్యుడి సూచన మేరకు వేసుకుంటే సరిపోతుందని గ్లెన్ మార్క్ ఫార్మా పేర్కొంది. 400ఎంజీ డోసుకు మొదటిసారి అనుమతి పొందిన కంపెనీ తమదేనని సంస్థ వివరించింది. ఫాబిఫ్లూ అనే బ్రాండ్ పేరుతో కంపెనీ ఈ ట్యాబ్లెట్లను విక్రయిస్తోంది. తొలుత 200 ఎంజీ డోసును తయారు చేసినా తరువాత రోగుల అవసరార్ధం మేరకు 400 ఎంజీని అభివృద్ధి చేసినట్లు కంపెనీ క్లినకల్ డెవలప్ మెంట్ విభాగం అధిపతి మోనికా టాండన్ అన్నారు. ఈ ఔషధాన్ని తీసుకున్న రోగులు ఏ విధంగా కోలుకుంటున్నారనే అంశాన్ని అధ్యయనం చేయటానికి పోస్ట్ మార్కెటింగ్ సర్వైలెన్స్ స్టడీ చేపట్టినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..