'ప్లాస్మాదానం- ప్రాణదానం' ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్
- August 07, 2020
హైదరాబాద్:కోవిడ్-19 పరిస్థితుల్లో సైబరాబాద్ పోలీసులు చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం అని అన్నారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి..శుక్రవారం సైబరాబాద్ కమిషనరేట్‌లో "ప్లాస్మాదానం- ప్రాణదానం" ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరు ప్లాస్మాదాతలను సత్కరించారు చిరంజీవి.. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ... రక్త దానం నుండి ఫ్లాస్మా దానం వరకు సైబరాబాద్ పోలుసులు చేస్తున్న సేవను గుర్తించుకోవాలని అన్నారు. ఇలాంటి మంచి మార్గంలో నన్ను నడిపిస్తున్నందుకు సీపీ సజ్జనార్ కి ధన్యవాదాలు తెలిపారు చిరు.. 22 ఏళ్ల క్రితం నాకు సామాజిక బాధ్యత తెలియని సమయంలో ఓ న్యూస్ పేపర్ లో ఒక వార్తా చూసి చలించిపోయానని అన్నారు.
ఆక్సిడెంట్ లో ఎంతో మంది మృతి చెందడం, రక్తం దొరక మృతి చెందుతున్నారని గమనించి నేను బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని భావించి ఏర్పాటు చేశానని, దీనికి అభిమానులు సహకరిస్తూ , నిత్యం బ్లడ్ దానం చేస్తూ ముందుకు సాగుతున్నామని అన్నారు. మేము చేసిన సేవలకి గాను మాకు ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అవార్డు ఇచ్చిందని చిరంజీవి వెల్లడించారు.
ఇక ఈ కోవిడ్ పరిస్థితిల్లో ఇప్పుడు అసలైన ఆయుధం ఫ్లాస్మా అని, ఈ ఫ్లాస్మా దానం చేయడంతో మరో ప్రాణాన్ని కాపాడిన వారు అవుతాముని చిరు వెల్లడించారు. రెండు రోజులు క్రితమే మా సమీప బందువుకు కోవిడ్ సోకి చాలా సీరియస్ అయ్యిందని, వెంటనే నాకు తెలిసిన స్వామి నాయుడు అనే వ్యక్తిని ఫ్లాస్మా దానం చేయమని చెప్పానని, దీనితో అతను అతను దానం చేయడంతోనే మా బందువు ప్రాణాలతో బయట పడ్డాడని చెప్పుకొచ్చారు చిరంజీవి.
ఇక ఈ ఫ్లాస్మా దానంపై ఎవరికీ అపోహలకు పోవద్దని, మీరు ఫ్లాస్మా దానం చేయడం ద్వారా ఎలాంటి బ్లడ్ లాస్ జరగదని చిరు స్పష్టం చేశారు. ఒకసారి కోవిడ్ వచ్చిన తరువాత రెండో సారి రావడం అనేది చాలా తక్కువ అని డాక్టర్స్ చెపుతున్నారని, భగవంతుడు ఇచ్చిన సంజీవని ప్లాస్మాను దానం చేయండి , ప్రాణాలు కాపాడండి అంటూ చిరంజీవి వెల్లడించారు. ఇక కోవిడ్ వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ ఫ్లాస్మానే మనల్ని కాపాడుతుందని, ఇది మానవత్వంకి సైన్స్ కి మధ్య జరుగుతున్న పోటీ గా భావించాలని అన్నారు చిరంజీవి.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







