యూఏఈలోని ఓ టవర్‌లో అగ్ని ప్రమాదం

- August 08, 2020 , by Maagulf
యూఏఈలోని ఓ టవర్‌లో అగ్ని ప్రమాదం

యూఏఈ: అబుదాబీ సివిల్‌ పోలీస్‌, అబుదాబీలోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఆ మంటల్ని చాకచక్యంగా ఆర్పివేశారు. అయితే, ఈ సందర్భంగా పలువురికి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. అల్‌ నహ్యాన్‌ రెసిడెంట్స్‌, ఓ అపార్ట్‌మెంట్‌లో పెద్ద యెత్తున శబ్దం విన్పించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్‌ మమూరా డిస్ట్రిక్ట్‌లోని అల్‌ మర్వు స్ట్రీట్‌లో గల భవనంలోని ఏడవ అంతస్తులో అ అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్‌ ట్రక్స్‌ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, రెసిడెంట్స్‌ని హుటాహుటిన అక్కడినుంచి ఖాళీ చేశారు. సమీపంలోని భవనాలకు మంటలు వ్యాపించకుండా చేశారు. ఆ తర్వాత మంటల్ని అదుపు చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com