కాంగ్రెస్ కు త్వరలో నూతన అధ్యక్షుడి ఎన్నిక
- August 09, 2020
న్యూ ఢిల్లీ:కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పదవీకాలం పొడిగించడంపై ఊహాగానాలకు స్వస్తి పలకాలని ఆ పార్టీ ఆదివారం నిర్ణయించింది. ఈ క్రమంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ పూర్తయ్యే వరకు సోనియాగాంధి పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతారని స్పష్టం చేసింది.ఒక సాధారణ అధ్యక్షుడిని ఇంకా ఎన్నుకోనందున పార్టీ రాజ్యాంగం ప్రకారం పొడిగింపు సాంకేతిక అవసరం అని కాంగ్రెస్ నేత ఒకరు తెలిపారు.
పార్టీ అధ్యక్ష ఎంపిక గుంరించి నిర్ణయాన్ని ముందస్తుగా ఎన్నికల సంఘానికి తెలియజేశామని కాంగ్రెస్ తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా 25 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియకు విఘాతం ఏర్పడిందని కాంగ్రెస్ చెబుతోంది. 2019 సార్వ్తత్రిక ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







