ఎలాంటి చెల్లుబాటయ్యే వీసా వున్నా యూఏఈకి ప్రయాణించొచ్చు
- August 11, 2020
యూఏఈ:భారత జాతీయులు చెల్లుబాటయ్యే ఎలాంటి యూఏఈ వీసా వున్నా, యూఏఈకి వెళ్ళవచ్చు. యూఏఈలో భారత రాయబారి ఈ విషయాన్ని వెల్లడించారు. రాయబారి పవన్ కపూర్, ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నోటిఫికేషన్ని ప్రస్తావిస్తూ, ఇండియా మరియు యూఏఈ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానాలు భారత జాతీయుల్ని ఇండియా నుంచి యూఏఈకి ఏ తరహా వీసా వున్నా తరలిస్తాయని వివరించారు. గతంలో కేవలం రెసిడెన్సీ వీసా వున్నవారికి మాత్రమే యూఏఈకి వెళ్ళేందుకు (వందే భారత్ మిషన్ ద్వారా) అవకాశం వుండేది. యూఏఈ క్తొ వీసాల జారీ ప్రక్రియ ప్రారంభించిన దరిమిలా, ఇండియాలోని సంబంధిత అథారిటీస్‌కి విజ్ఞప్తి చేయడం జరిగిందనీ, ఈ మేరకు సానుకూల నిర్ణయం వచ్చిందని చెప్పారు. ఇరు దేశాల మధ్య వున్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో రెండు దేశాలూ ఈ విషయమై సానుకూలంగా స్పందించాయి. కాగా, యూఏఈ రెసిడెన్సీ వీసాలు లేకపోవడంతో భారతదేశంలో వుండిపోయిన తమ కుటుంబ సభ్యులకు ఇది వెసులుబాటు కల్పిస్తుందని యూఏఈలోని పలువురు భారతీయులు అభిప్రాయపడ్డారు. మార్చి నుంచి తాను, తన కుటుంబ సభ్యులతో ముంబైలో చిక్కుకుపోయాననీ, తాజా నిర్ణయంతో తమ కుటుంబానికి ఊరట దక్కుతోందని దుబాయ్ రెసిడెంట్ శ్రద్ధా సల్లా చెప్పారు.
తాజా వార్తలు
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...







