ఒమన్‌లో క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుదల
- February 06, 2016
ఒమన్ క్యాన్సర్ అసోసియేషన్ ఫౌండర్ మరియు చైర్ పర్సన్ యుథార్ అల్ రవాహి, ఒమన్‌లో క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుదల ఆందోళన కలిగిస్తోందని అల్ రవాహి చెప్పారు. క్యాన్సర్ బాధితులకు తగిన సేవలందించేందుకు 180 మంది నర్స్‌లకు ఒమన్ పెట్రోల్ డెవలప్మెంట్తో కలిసి ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించామని ఆమె చెప్పారు. ఒమన్ క్యాన్సర్ అసోసియేషన్ డాక్టర్లకూ శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోందనీ, బ్రెస్డ్ క్యాన్సర్ కేసులు ఒమన్‌లో చాలా కామన్‌గా మారాయనీ, దాని తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తోందని అన్నారామె. 40 ఏళ్ళు పైబడిన మహిళలకు మామ్మోగ్రఫీ పరీక్షల్ని ఉచితంగా అవెన్యూ మాల్లో నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ మొబైల్ స్క్రీనింగ్ సెంటర్ సేవలందించనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







