కోవిడ్-19 ఎఫెక్ట్: జీతాల కోసం ఆగస్ట్ 13 వరకల్లా రిజిస్టర్ చేసుకోవాలన్న కువైట్
- August 12, 2020
కువైట్ సిటీ:కరోనా సంక్షోభం నేపథ్యంలో జీతాల రూపంలో ప్రభుత్వం అందిస్తున్న సాయం కోసం ఈ నెల 13 వరకల్లా దరఖాస్తు చేసుకోవాలని కువైట్ వెల్లడించింది. కరోనా తర్వాతి పరిస్థితుల కారణంగా పలు రంగాల్లో ఉపాధి కొల్పోయిన వారికి ఆర్ధిక సాయం చేసేందుకు కువైట్ సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 'కువైట్ వితౌట్ శాలరీస్' కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నిన్నటి వరకు ఈ కమిటికి 4,726 దరఖాస్తులు అందినట్లు సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇంకా ఎవరైనా పలు కరాణాలతో జీతాలు అందకుంటే ఆగస్ట్ 13 నాటికి దరఖాస్తు చేస్తుకోవాలని సూచించింది. దరఖాస్తు స్వీకరణకు ఆన్ లైన్ విధానాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. అయితే..దరఖాస్తు చేసుకున్న వారిలో ఎవరెవరికి సాయం చేయాలనేది నిర్ధారించేందుకు కమిటీ పలు ప్రభుత్వ శాఖల అధికారులను సంప్రదించి లబ్ధిదారులను ఎంపిక చేయనుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు