తగ్గిన పసిడి, వెండి ధరలు...

- August 12, 2020 , by Maagulf
తగ్గిన పసిడి, వెండి ధరలు...

గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని అంటుతున్న బంగారం ధరలకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ ఊరట లభించింది. రష్యా నుంచి వస్తున్న తొలి వ్యాక్సిన మంగళవారం విడుదల చేయడంతో పాటు అధ్యక్షుడు పుతిన్ తన కుమార్తె మీదే ప్రయోగం చేయడంతో ప్రపంచానికి పెద్ద రిలీఫ్ లభించింది. దాంతో పెరిగిన పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. గరిష్టంగా రూ.58,250కి చేరుకున్న పది గ్రాముల పసిడి ధర రూ.54,600 కు దిగివచ్చింది. అదే విధంగా వెండి ధర కిలో రూ.76,000 నుంచి 67,000లకు దిగింది. ముందంజలో ఉన్న మరో రెండు వ్యాక్సిన్లు అమెరికాకు చెందిన ఆక్స్‌ఫర్డ్, భారత్ బయోటెక్ వ్యాక్సిన్లు కూడా సక్సెస్ అయితే బంగార, వెండి ధరల్లో మరింత క్షీణత కనబడుతుందని మార్కెట్ విశ్లేషకుల అంచనా.

వ్యాక్సిన్లు విజయవంతమైతే సాధారణ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయి. విభిన్న రంగాల్లో పెట్టుబడుల ఆవశ్యకత మెరుగుపడుతుంది. స్ఠాక్ మార్కెట్ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ఫలితంగా బంగారం మీద పెట్టుబడి పెట్టే వారి సంఖ్య తగ్గి ధరలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు(31.10 గ్రాములు) బంగారం ధర 1939 డాలర్లకు చేరింది. దుబాయ్ లో గ్రాము ధర రూ.4650 గా ఉంటే.. దేశీయ మార్కెట్లో రూ.5825 పలుకుతోంది. మంగళవారం రాత్రి గ్రాము ధర రూ.5460 ఉంది. అదే కిలో లెక్కన అంచనా వేస్తే గరిష్టంగా రూ.3 లక్షలకు పైగా తగ్గింది. ముందు ముందు 10 గ్రాముల మేలిమి బంగారం రూ. 50,000 నుంచి అంతకన్నా తక్కువకు కూడా చేరుకోవచ్చని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com