సౌదీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నోటీస్ బోగస్
- August 12, 2020
రియాద్: అక్టోబర్ నుంచి సౌదీ అరేబియా అంతర్జాతీయ విమానాల్ని నడిపేందుకు నిర్ణయం తీసుకుందంటూ సర్కులేట్ అవుతోన్న ఓ సర్కులర్ని ఫేక్ అని జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పేర్కొంది. మార్చి 15 నుంచి సౌదీ అరేబియా అంతర్జాతీయ విమానాల్ని కరోనా వైరస్ నేపథ్యంలో రద్దు చేసిన విషయం విదితమే. కాగా, మే 31 నుంచి డొమెస్టిక్ విమానాలు నడుస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఓ ఫేక్ సర్క్యులర్ జిఎసిఎ పేరుతో ప్రచారంలో వుంది. ‘అక్టోబర్ వరకు అంతర్జాతీయ సర్వీసులకు వీలు లేదు’ అని పేర్కొన్నట్లుగా ఆ సర్క్యులర్ రూపొందబడి వుంది. ప్రస్తుతం అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ, అయితే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్లో భాగంగా మెడికల్ ఎవాక్యుయేషన్, రిపాట్రియేషన్ విమానాలు వంటివి మాత్రం నడుపుతున్నట్లు జిఎసిఏ అధికార ప్రతినిధి¸ ఇబ్రహీం బిన్ అబ్దుల్లా అల్ర్వోసా చెప్పారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు