మరో ఎంప్లాయర్ కోసం వలస కార్మికుల్ని వినియోగించడం నేరం
- August 13, 2020
మస్కట్: ఎంప్లాయర్స్, వలస కార్మికుల్ని మరో ఎంప్లాయర్ కోసం నియమిస్తే అది నేర పూరి తచర్య అవుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నేరానికి పాల్పడితే 1,000 ఒమన్ రియాల్స్ జరీమానా, నెల రోజుల జైలు శిక్ష తప్పదని హెచ్చరించడం జరిగింది. ‘పౌరులు, నివాసితులకు హెచ్చరిక. వలస కార్మికుడ్ని వేరే ఎంప్లాయర్ దగ్గర పనిచేసేందుకు పంపితే అది శిక్షార్హమైన నేరం’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జరీమానా, జైలు శిక్షలు ఆయా నేరాల్లో పాల్గొనే వ్యక్తుల సంఖ్యను బట్టి పెరుగుతుందని కూడా స్పష్టం చేశారు. సంబంధిత అథారిటీస్ నుంచి పర్మిట్ లేకుండా వలస కార్మికుడు తన యజమాని కాకుండా వేరొకరి దగ్గర పనిచేస్తే 800 ఒమన్ రియాల్స్ జరీమానా, నెల రోజుల జైలు శిక్షతోపాటు డిపోర్టేషన్ కూడా చేస్తారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు