పూరీని ప్రధాని నరేంద్ర మోదీ నేడు సందర్శించనున్నారు

- February 06, 2016 , by Maagulf
పూరీని ప్రధాని నరేంద్ర మోదీ నేడు సందర్శించనున్నారు

ఒడిశాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం పూరీని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సందర్శించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని శ్రీక్షేత్రంలో జగన్నాథుడిని దర్శించుకున్న అనంతరం పరదీప్‌లో ఐఓసీఎల్‌ నిర్మించిన చమురుశుద్ధి కర్మాగారాన్ని జాతికి అంకితం చేస్తారు. మోదీ తొలుత జట్నిలోని నైజర్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌) సందర్శిస్తారు. అధ్యాపకులు, విద్యార్థులతో సమావేశమవుతారు. అక్కడి నుంచి శ్రీక్షేత్రానికి వెళతారు. గంటపాటు శ్రీక్షేత్రంలో ఉంటారు.ఆ తర్వాత పరదీప్‌కు, అక్కడి నుంచి భువనేశ్వర్‌కు వెళతారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com