లక్ష మందికి వైద్య సేవ అందించిన సౌదీ కోవిడ్-19 క్లినిక్స్
- August 14, 2020
కరోనా మహమ్మారి ప్రబలిన నాటి నుంచి నేటి వరకు సౌదీలోని కోవిడ్-19 హెల్త్ సెంటర్స్ దాదాపు లక్ష మందికి వైద్యసేవలు అందించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్ పరీక్షలు, చికిత్సకు సంబంధించి రెండు హెల్త్ సెంటర్స్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తెత్తమ్మన్, తాకద్ పేర్లతో కరోనా బాధితులకు సహాయంగా నిలబడింది సౌదీ ప్రభుత్వం. ఇప్పటివరకు మదీనాలోని తెత్తమ్మన్ ఆరోగ్య సేవా కేంద్రం ద్వారా 63,529 మందికి చికిత్స అందించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అదేసమయంలో అల్ అషలోని తాకద్ ఆరోగ్య కేంద్రం ద్వారా 21,030 మంది వైద్య పరీక్షలు అందించినట్లు వివరించారు. అల్ అషలో తాకద్ ద్వారా రెండు చోట్ల అల్ మబ్రజ్, అల్ హోఫఫ్ లో వైద్య పరీక్షలు అందిస్తున్నారు. డ్రైవ్ త్రూ టెస్టింగ్ ప్రతి రోజు 1,200 నుంచి 1,500 వరకు వైద్యపరీక్షలు నిర్వహించే సామర్ధ్యం ఈ కేంద్రాలకు ఉంది. ఇక మదీనాలోని మూడు తత్తమ్మన్ ఆరోగ్య సేవా కేంద్రాల ద్వారా ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వైద్య సేవలు బాధితులకు అందుబాటులోకి తీసుకొచ్చింది సౌదీ ప్రభుత్వం. ఈ రెండు ఆరోగ్య సేవా కేంద్రాల్లో మంత్రిత్వశాఖకు చెందిన సెహతి యాప్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు.
ఇదిలాఉంటే..కింగ్ డమ్ పరిధిలో కొత్తగా మరో 34 మంది కోవిడ్ కారణంగా మరణించారు. దీంతో ఇప్పటివరకు సౌదీ పరిధిలో కోవిడ్ మరణాల సంఖ్య 3,303కి పెరిగింది. అలాగే కొత్తగా 1,482 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో కింగ్ డమ్ లో కరోనా బాధితుల సంఖ్య 2,94,519కి చేరింది. ప్రస్తుతం 30,823 యాక్టీవ్ కేసులు ఉండగా..అందులో 1,805 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరోవైపు కరోనా నుంచి లేటెస్ట్ గా 3,124 మంది కోలుకోవటంతో మొత్తం రికవరీ సంఖ్య 2,60,393కి చేరింది. ఇప్పటివరకు కింగ్ డమ్ పరిధిలో 40 లక్షల మందికిపైగా కరోనా టెస్టులు నిర్వహించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!