యూఏఈలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..

- August 16, 2020 , by Maagulf
యూఏఈలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..

యూఏఈ: యూఏఈలో క‌రోనా పాజిటివ్ కేసులు పెరిగి... రిక‌వ‌రీలు త‌గ్గాయి. శ‌నివారం 283 కొత్త కేసులు నమోదు కాగా 98 రిక‌వ‌రీలు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా ఈ వైర‌స్ సోకిన వారి సంఖ్య 64,102కు చేరితే... కోలుకున్న వారు 57,571 మంది అయ్యారు. అలాగే నిన్న సంభ‌వించిన రెండు కొత్త మ‌ర‌ణాల‌తో క‌లిపి ఇప్ప‌టికే 361 మందిని ఈ మ‌హ‌మ్మారి బ‌లిగొంది. ప్ర‌స్తుతం యూఏఈలో 6,170 యాక్టివ్ కేసులు ఉన్నాయి.మ‌రోవైపు కోవిడ్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు యూఏఈ ముమ్మ‌రంగా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తోంది. 

--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com