ఆగస్ట్ 24 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి బీఎల్ఎస్ సేవా కేంద్రాలు
- August 17, 2020
యూఏఈ:లాక్ డౌన్ ఇన్నాళ్లుగా నిలిచిపోయిన బీఎల్ఎస్ సేవా కేంద్రాలు..ఇక ఆగస్ట్ 24 నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. దీంతో వినియోగదారులకు పాస్ పోర్ట్, ఇతర సేవలు పూర్తి స్థాయిలో అందనున్నట్లు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఆగస్ట్ 24 నుంచి సేవలు ప్రారంభించనున్న బీఎల్ఎస్ కేంద్రాల వివరాలు...దుబాయ్ లోని కేరళా ముస్లిం కల్చర్ సెంటర్ లోని మొదటి అంతస్తు, రూం నెం. 102లో ఉంది. మరోటి రస్ అల్ ఖైమాలోని ఇండియన్ స్కూల్ పక్క బిల్డింగ్ లో ఇండియన్ రిలీఫ్ కమిటీలో ఉంది. ఈ రెండు బీఎల్ఎస్ సేవా కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఇక ఈ రెండు కేంద్రాల్లో ఆన్ లైన్ అపాయింట్మెంట్ సేవలు ఈ రోజు (ఆగస్ట్ 17) నుంచి ప్రారంభం అయ్యాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల