వన్‌ ప్యాసింజర్‌ రూల్‌ తొలగించాలని డిమాండ్‌ చేస్తున్న ట్యాక్సీ కంపెనీలు

- August 17, 2020 , by Maagulf
వన్‌ ప్యాసింజర్‌ రూల్‌ తొలగించాలని డిమాండ్‌ చేస్తున్న ట్యాక్సీ కంపెనీలు

కువైట్: పలు ప్రైవేటు ట్యాక్సీ కంపెనీలు, ఒక్క ప్యాసింజర్‌ మాత్రమే.. అనే రూల్‌ని తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. మొత్తం 70కి పైగా ట్యాక్సీ కంపెనీల ఓనర్లు, ఈ డెసిషన్‌ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో 300కి పైగా కంపెనీలు మూతపడే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. ఇప్పటికే ఫైనాన్షియల్‌ సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఈ వన్‌ ప్యాసింజర్‌ విధానంతో మరింత ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ తర్వాత వెసులుబాట్లలో ట్యాక్సీలకు అనుమతినిస్తూ ప్రభుత్వం, ట్యాక్సీల్లో కేవలం ఒకే ప్యాసింజర్‌కి అవకాశమిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com