పాదచారులను గౌరవిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు-సచిన్
- February 07, 2016
క్రికెట్ లో స్ట్రైకర్ కు నాన్ స్ట్రైకర్ కు ఉన్న అవగాహనే రోడ్డు ప్రయాణంలోనూ పాటించాలని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సూచించాడు. వాహనాలపై వెళ్లేవారు పాదచారులను గౌరవిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నాడు. నగరంలో ఆదివారం రహదారి భద్రతా ప్రచార కార్యక్రమాన్ని ఆరంభించిన అనంతరం సచిన్ తనదైన క్రికెట్ భాషలో మాట్లాడాడు. క్రికెట్ ఆడేటప్పుడు బ్యాట్స్ మెన్ కు అవతలి ఎండ్ లో ఉన్న ఆటగాడికి చక్కని సమన్వయం ఎంతో ముఖ్యమైనదో.. అదే తరహా విధానాన్ని రోడ్లుపై వెళుతున్నప్పుడు కూడా పాటిస్తే మంచిదన్నాడు. ఈ రకంగా మనం స్వచ్ఛందంగా రూల్స్ ను పాటించిన రోజున భారతీయ రోడ్లు అత్యంత సురక్షితమైన రహదారులుగా మారతాయనడంలో ఎటువంటి సందేహం లేదని మాస్టర్ తెలిపాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







