ఏపీలో భారీగా కరోనా కేసులు
- August 18, 2020
ఏపీలో కరోనా కేసులు మళ్ళీ భారీగా పెరిగాయి. తాజా బులిటెన్ ప్రకారం... ఏపీలో 3 లక్షలు దాటాయి కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9652 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,06, 261కి చేరింది. కరోనా కారణంగా రాష్ట్రంలో కొత్తగా 88 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ మహమ్మారి కారణంగా చనిపోయిన వారి సంఖ్య 2820కి చేరుకుంది. మరోవైపు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9211 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 85130 యాక్టీవ్ కేసులున్నాయి. ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకూ 29,61,611 టెస్ట్‌లు నిర్వహించినట్లు ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
తాజా వార్తలు
- రష్యాలో భారీ భూకంపం
- ఇంద్రకీలాద్రిలో దసరా ఏర్పాట్లు ముమ్మరం
- పొలిటికల్ ఎంట్రీ పై బ్రహ్మానందం సంచలన ప్రకటన..
- హైదరాబాద్: సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్నిప్రమాదం …
- ఓటరు జాబితా సవరణలో కీలక మార్పు..
- రక్షణ సహకారం పై కువైట్, ఫ్రాన్స్ చర్చలు..!!
- రియాద్‌లో చదరపు మీటరుకు SR1,500..ఆన్ లైన్ వేదిక ప్రారంభం..!!
- బహ్రెయిన్-యుఎస్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం..!!
- ఒమన్ లో 15 కిలోల బంగారు కడ్డీలు సీజ్..!!
- ఇజ్రాయెల్ డిప్యూటీ రాయబారికి సమన్లు జారీ చేసిన యూఏఈ..!!