కోవిడ్-19 రోగులకు ప్లాస్మా థెరపీ బ్రహ్మాస్త్రం: ఎస్.ఎస్.రాజమౌళి
- August 18, 2020
హైదరాబాద్: ప్రజల్లో ప్లాస్మాపై అనేక అపోహలుండేవని, వీటిని పోగొట్టేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. వీటికి చిరంజీవి, నాగార్జున, విజయ్ దేవరకొండ, రాజమౌళి, కీరవాణి సహకరించారని పేర్కొన్నారు. కీరవాణి ప్లాస్మా యోధులకోసం ఒక పాట కూడా రూపొందించారని తెలిపారు. మంగళవారం సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో ప్లాస్మా దానం చేసిన పలువురికి కమిషనర్ సజ్జనార్, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి ప్రోత్సాహకాలు అందించారు.
ఈ సందర్భంగా కరోనాను జయించిన రాజమౌళి ప్లాస్మా ఇవ్వటానికి ముందుకు రావటం శుభ పరిణామమని సజ్జనార్ కొనియాడారు. కరోనా సోకితే ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. ప్లాస్మా దానానికి అందరూ ముందుకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ప్లాస్మా వివరాలు అన్ని పొందుపరుస్తూ http://Donateplasma.scsc.in అనే వెబ్‌సైట్‌ను రూపొందించామన్నారు. తమతో కలిసి అనేక స్వచ్చంద సంస్థలు కలిసి పనిచేస్తున్నాయని, చాలా మంది యువత, సాఫ్ట్వేర్ ఉద్యోగులు వలంటీర్లుగా పనిచేస్తున్నారని చెప్పారు.
సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్‌రూమ్ నంబర్లు: 90002 57058, 94906 17444, రిజిష్టర్ పోర్టల్ లింక్: http://Donateplasma.scsc.in




తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







