ఏ మాస్క్ ధరించాలో శాస్త్రవేత్తల మాటల్లో..

- August 18, 2020 , by Maagulf
ఏ మాస్క్ ధరించాలో శాస్త్రవేత్తల మాటల్లో..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరణమృదంగం మోగిస్తోంది.  రోజు రోజుకు కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ప్రతీ ఒక్కరికీ మాస్క్ తప్పనిసరి అయిపోయింది. అయితే మాస్క్ పెట్టుకుంటే కరోనా కాదా..? ఏ మాస్క్ వాడితే మంచిది..? అనే ప్రశ్నలు అందరిలోనూ నెలకొన్నాయి.

తాజాగా ఈ విషయంపై అమెరికా డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.  లేజర్‌ సెన్సర్‌ డివైజ్ తో 14 రకాల మాస్క్‌లు, ఫేస్‌ కవరింగ్స్‌ను పోల్చి చూశారు. ఏ మాస్క్ ధరించినప్పుడు తుంపర్లు ఏ దిశలో పయనించాయి...? తుంపర్లను అడ్డుకోవడం విషయంలో మాస్క్ లు ఎలా పనిచేస్తున్నాయి. అని తెలుసుకునేందుకు లేజర్‌ బీమ్, లెన్స్, మొబైల్‌ ఫోన్‌ కెమెరాతో మాస్క్ లను పరిశీలించారు. ఈ క్రమంలో వైరస్ సోకకుండా తుంపర్లను నిరోధించడంలో ఎన్ 95 మాస్కులే అత్యుత్తమమని తేలింది. అయితే ఎన్ 95 మాస్కులలో వాల్వ్ లేనివి మాత్రమే వాడాలి. వాల్వ్ ఉన్నది వాడితే కరోనా సోకే అవకాశం కొద్దిగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎన్ 95 మాస్కుల తరువాత త్రీ లేయర్‌ మాస్క్‌లు, కాటన్‌-పాలిప్రోలిన్‌-కాటన్‌ మాస్క్‌లు, టూ లేయర్‌ పాలిప్రోపిలిన్‌ ఏప్రాన్‌ మాస్క్‌లు మంచివని తేలింది.

ఫేస్‌ కవరింగ్స్‌, వదులైన బట్టతో చేసిన మాస్క్‌లు పెట్టుకున్నా పెట్టుకొకపోయినా కరోనా సోకే అవకాశాలు ఒకే విధంగా ఉన్నాయి. అలాగే వాల్వ్‌లున్న ఎన్‌-95 మాస్క్‌లు కూడా తుంపర్లను అడ్డుకోవడంలో పని చేయడం లేదని,  గాలిని బయటకు వదిలిన సమయంలో ఎన్‌-95 మాస్క్‌కున్న వాల్వ్‌లు తెరుచుకోవడం వల్ల ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని పరిశోధనలో వెల్లడైంది. కరోనా రాకుండా ఉండాలంటే మాస్క్ పెట్టుకోవడం మాత్రమే కాదు.. మనం పెట్టుకున్న మాస్క్ మంచిదా కాదా అనేది కూడా ఆలోచించాలి అప్పుడే మనకి కరోనా సోకకుండా ఉంటుంది...!!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com