రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో వర్క్ మినిస్టర్ తనిఖీ
- August 19, 2020
మనామా:వర్క్స్, మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్ మినిస్టర్ ఇంజనీర్ ఇస్సా మ్ ఖలాఫ్, అల్ లాజ్వి హౌసింగ్ డెవలప్‌మెంట్ వైపుగా వెళ్ళే రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో తనిఖీలు నిర్వహించారు. జూన్‌లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు విలువ 5.1 మిలియన్ బహ్రెయినీ దినార్లు. హమాద్ టౌన్‌లో ఈ ప్రాజెక్టు చేపట్టారు. మినిస్టర్ వెంట వర్క్స్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ అహ్మద్ అల్ ఖయ్యాత్, రోడ్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ హుడా ఫాక్రో, రోడ్ ప్రాజెక్ట్స్ మరియు మెయిన్‌టెనెన్స్ డైరెక్టర్ సయ్యద్ బదర్ అలావి అలాగే రోడ్స్ ప్లానింగ్ మరియు డిజైన్ డైరెక్టర్ ఇంజనీర్ మహా ఖలీఫా హమాదా వున్నారు. ఈ ప్రాజెక్టు మెయిన్ రోడ్ నెట్‌వర్క్‌లో అతి కీలకమైనదనీ, ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు ఈ ప్రాజెక్ట్‌తో చెక్ పెట్టవచ్చునని అన్నారు.
తాజా వార్తలు
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..