వినాయ‌క చ‌వ‌తి పండ‌గ‌ను ప‌ర్యావ‌ణ హితంగా ఇండ్లలోనే జ‌రుపుకోవాలి-మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌

- August 20, 2020 , by Maagulf
వినాయ‌క చ‌వ‌తి పండ‌గ‌ను ప‌ర్యావ‌ణ హితంగా ఇండ్లలోనే జ‌రుపుకోవాలి-మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌

హైద‌రాబాద్‌:కోవిడ్ -19 కారణంగా  వినాయ‌క చ‌వ‌తి పండ‌గ‌ను ప‌ర్యావర‌ణ హితంగా ఇండ్లలోనే  జ‌రుపుకోవాల‌ని న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు జిహెచ్ఎంసి మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు*. గురువారం జిహెచ్ఎంసి ప్ర‌ధాన కార్యాల‌యంలో జిహెచ్ఎంసి స్టాండింగ్ క‌మిటీ మెంబ‌ర్ స్వ‌ప్న‌, కార్పొరేట‌ర్ మ‌మ‌త‌, శాటేష‌న్ విభాగం అద‌నపు క‌మిష‌న‌ర్ రాహుల్ రాజ్‌, హెచ్‌.ఎం.డి.ఏ ఎస్‌.ఇ ప‌రంజ్యోతిల‌తో క‌లిసి జిహెచ్ఎంసి ఉద్యోగులు, సిబ్బంది, మీడియా ప్ర‌తినిధుల‌కు మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హాల‌ను మేయ‌ర్ పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ప‌ర్యావ‌ర‌ణం ప‌ట్ల ప్ర‌జ‌ల‌లో చైత‌న్యం క‌లిగించుట‌లో భాగంగా మ‌ట్టి విగ్ర‌హాల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ సంవత్స‌రం జిహెచ్ఎంసి ద్వారా 50వేలు, హెచ్‌.ఎం.డి.ఏ ద్వారా మ‌రో 50వేల మ‌ట్టి విగ్ర‌హాల‌ను పంపిణీ చేస్తున్న‌ట్లు తెలిపారు. కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి స‌హ‌కారంతో జిహెచ్ఎంసి కార్పొరేట‌ర్ల ద్వారా అన్ని వార్డుల‌లో మ‌ట్టి వినాయ‌క విగ్ర‌హాల పంపిణీ చేస్తున్న‌ట్లు తెలిపారు. హెచ్‌.ఎం.డి.ఏ ద్వారా నిర్దేశించిన కేంద్రాలతో పాటు మొబైల్ వాహ‌నాల ద్వారా కూడా కాల‌నీల‌లో పంపిణీ చేస్తున్న‌ట్లు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com