వినాయక చవతి పండగను పర్యావణ హితంగా ఇండ్లలోనే జరుపుకోవాలి-మేయర్ బొంతు రామ్మోహన్
- August 20, 2020
హైదరాబాద్:కోవిడ్ -19 కారణంగా వినాయక చవతి పండగను పర్యావరణ హితంగా ఇండ్లలోనే జరుపుకోవాలని నగర ప్రజలకు జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు*. గురువారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ స్వప్న, కార్పొరేటర్ మమత, శాటేషన్ విభాగం అదనపు కమిషనర్ రాహుల్ రాజ్, హెచ్.ఎం.డి.ఏ ఎస్.ఇ పరంజ్యోతిలతో కలిసి జిహెచ్ఎంసి ఉద్యోగులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు మట్టి వినాయక విగ్రహాలను మేయర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణం పట్ల ప్రజలలో చైతన్యం కలిగించుటలో భాగంగా మట్టి విగ్రహాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ సంవత్సరం జిహెచ్ఎంసి ద్వారా 50వేలు, హెచ్.ఎం.డి.ఏ ద్వారా మరో 50వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కాలుష్య నియంత్రణ మండలి సహకారంతో జిహెచ్ఎంసి కార్పొరేటర్ల ద్వారా అన్ని వార్డులలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. హెచ్.ఎం.డి.ఏ ద్వారా నిర్దేశించిన కేంద్రాలతో పాటు మొబైల్ వాహనాల ద్వారా కూడా కాలనీలలో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!







