ఒమన్ లో నిజామాబాద్ జిల్లా వాసి మృతి

- August 23, 2020 , by Maagulf
ఒమన్ లో నిజామాబాద్ జిల్లా వాసి మృతి

మ‌స్క‌ట్: ఒమన్ ‌లో నిజామాబాద్ జిల్లా వాసి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు మాల‌వ‌త్ పాండ్యా(33)ది నిజామాబాద్ జిల్లా ధ‌ర్ప‌ల్లి మండ‌లం రేకుల‌ప‌ల్లి. ఒమ‌న్‌లోని స‌లాల ప్రాంతంలో ఉన్న అల్ నాస‌ర్ అల్ అరేబియా సంస్థ‌లో ప‌ని చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో రెండు రోజుల క్రితం గుండెపోటుతో మ‌ర‌ణించాడు.దీంతో శ‌నివారం పాండ్యా కుటుంబ స‌భ్యుల‌కు ఒమ‌న్ నుంచి అధికారులు ఫోన్ ద్వారా ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. దీంతో కుటుంబ స‌భ్యులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. మృతదేహాన్ని త్వ‌ర‌గా స్వ‌దేశానికి ర‌ప్పించాల‌ని వారు కోరుతున్నారు. మృతుడికి భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. పాండ్యా మృతితో రేకుల‌ప‌ల్లిలో విషాదం నెల‌కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com