కోవిడ్ -19 కు వ్యతిరేకంగా ఔషధం కనిపెట్టే పనిలో యూఏఈ
- August 23, 2020
యూఏఈ: యూఏఈ లో కరోనా ప్రభావం తగ్గినట్టే తాగి మరలా పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో, కరోనాను అరికట్టే దిశగా యాంటీవైరల్ ఔషధాన్ని అభివృద్ధి చేయడానికి ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ యూఏఈ లో ప్రారంభంకానుంది.
షార్జా విశ్వవిద్యాలయం మరియు 'సందూక్ అల్ వతన్' సంస్థ సంయుక్తంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టును ప్రారంభించడానికి పరిశోధన ఒప్పందాలు కుదుర్చుకున్నాయని అబుధాబి మీడియా కార్యాలయం ట్విట్టర్లో పేర్కొంది.
.@sandooqalwatan and @uSharjah have signed research agreements to launch a ground-breaking project to develop an antiviral drug for COVID-19, under Sandooq Al Watan’s Applied Research and Development programme ‘SWARD’. pic.twitter.com/3k0KwhUrIL
— مكتب أبوظبي الإعلامي (@admediaoffice) August 23, 2020
సందూక్ అల్ వతన్ యొక్క అప్లైడ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ "SWARD" క్రింద ప్రవేశపెట్టిన ఈ పరిశోధన ప్రాజెక్ట్, చికిత్సకు అవసరమైన యాంటీవైరల్ ఔషధం రూపొందించటమే లక్ష్యంగా కొనసాగనుంది.
వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవటానికి యూఏఈ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా సందూక్ అల్ వతన్ చేపడుతున్న మూడు ప్రాజెక్టులలో ఆషాఢం కనిపెట్టటం మొదతటిదైతే, వేగవంతంగా మరియు తక్కువ ఖర్చుతో కూడిన పద్దతితో రోగులలో కోవిడ్ -19 ను గుర్తించడానికి పరిష్కారాలను అభివృద్ధి చేసేవిగా మిగితా రెండు ప్రాజెక్టులు ఉండనున్నాయి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!