రాజీనామాకు సోనియాగాంధీ రెడీ..
- August 23, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఎక్కువకాలం కాంగ్రెస్ చేతిలోనే అధికారం వుంది. అయితే ఇటీవలి కాలంలో కాంగ్రెస్ ప్రభ కోల్పోతోంది. తాజాగా అధ్యక్ష పదవినుంచి తప్పుకోవడానికి సోనియాగాంధీ రెడీ అయ్యారు. తాజాగా కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూలేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. గత ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే పార్టీ సీనియర్ల ఒత్తిడి మేరకు పగ్గాలు చేపట్టిన సోనియా గాంధీ కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకురాలేకపోయారు.
ఈ నేపథ్యంలోనే పార్టీలో అంతర్గత సంక్షోభం మరింతగా ముదిరింది. కాంగ్రెస్ పటిష్టం కావడానికి పార్టీ నాయకత్వలో మార్పులు తీసుకురావల్సిన సమయం ఆసన్నమైంది. ఇదే అంశం తెరపైకి వచ్చింది. అయితే గత వారం రోజులుగా జరుగుతున్న అనేక ఉత్కంఠ పరిణామాల అనంతరం.. సోనియా తాత్కాలిక అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేసినట్లు జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అవి ఎంతవరకూ నిజమో కాంగ్రెస్ నేతలే తేల్చాల్చివుంది.
అయితే దీనిపై ఇప్పటి వరకు పార్టీ పెద్దల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు పార్టీలో నాయకత్వ మార్పులు తీసుకురావాలని 23 మంది సీనియర్లు ఆదివారం కాంగ్రెస్ అధినేత్రికి లేఖరాశారు. అంతేకాకుండా పార్టీలోని జూనియర్లు సైతం నాయకత్వ మార్పును కోరుకుంటున్నారు.
తమ స్వరాన్ని వినిపించారు. ఇప్పటికే అధ్యక్ష పదవి నుంచి సోనియా వైదొలిగినట్లు చెబుతున్నారు. అయితే సోమవారం జరుగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆమె రాజీనామాను అధికారికంగా ప్రకటిస్తారని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకవేళ అధ్యక్ష పదవికి సోనియా రాజీనామా చేస్తే మరోసారి రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా లేక కొత్త నేతను ఎన్నుకుంటారా అనేది జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
అయితే ఇటీవల సోనియా తనయ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వెలిబుచ్చిన అభిప్రాయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గాంధీయేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే అవకాశాలున్నాయంటున్నారు. మరి ఆ పీఠం ఎవరికి దక్కనుందో వేచి చూడాల్సిందే...
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!