ఖతారీ క్వాలిటీ మార్క్‌ని ప్రారంభించిన ప్రైమ్ మినిస్టర్‌

- August 24, 2020 , by Maagulf
ఖతారీ క్వాలిటీ మార్క్‌ని ప్రారంభించిన ప్రైమ్ మినిస్టర్‌

దోహా:ప్రైమ్ మినిస్టర్‌, మినిస్టర్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ షేక్‌ ఖాలిద్‌ బిన్‌ ఖలీఫా బిన్‌ అబ్దుల్‌అజీజ్‌ అల్‌ థని, ఖతారీ క్వాలిటీ మార్క్‌ని ప్రారంభించారు. లోకల్‌, రీజినల్‌ అలాగే గ్లోబల్‌ మార్కెట్స్‌లో పోటీతత్వాన్ని పెంచేలా ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. అల్‌ ఖతారియాని ఈ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్‌, మినిస్టర్‌ ఆఫ్‌ ఇంటీరియర్‌ సత్కరించారు. ఖతారీ క్వాలిటీ మార్క్‌ని మొట్టమొదటగా సొంతం చేసుకున్నందుకు ఈ సన్మానం చేశారు. ఖతారీ జనరల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ స్టాండర్డ్స్‌ అండ్‌ మెట్రాలజీ ఈ ఖతారీ క్వాలిటీ మార్క్‌ అనే బ్యాడ్జిని అందజేస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com