యూఏఈ:అత్యవసర వాహనాలకు దారి ఇవ్వని వందల కొద్ది వాహనాలకు భారీగా జరిమానాలు

- August 24, 2020 , by Maagulf
యూఏఈ:అత్యవసర వాహనాలకు దారి ఇవ్వని వందల కొద్ది వాహనాలకు భారీగా జరిమానాలు

యూఏఈ:అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకుండా తాత్సారం చేసే వాహనదారులపై కొరఢా ఝులిపించారు. గతేడాదికిగాను 400 మంది వాహనదారులకు జరిమానాలు విధించినట్లు యూఏఈ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలను వెల్లడించింది. 2019లో మొత్తం 424 మంది వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించినట్లు తెలిపింది. ఆంబులెన్స్ లు, ఫైర్ ఇంజిన్లు, పాట్రోల్ వాహనాల లాంటి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోవటం అంటే ప్రమాదంలో ఉన్న వారి ప్రాణాలతో చెలగాటం ఆటడమేనని ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రిత్వ శాఖ..నిబంధనల ఉల్లంఘనులకు గతంలో కంటే మూడు రెట్లు ఎక్కువగా జరిమానా విధించింది. ఒక్కో వాహనదారుడికి Dh3000 ఫైన్ తో పాటు..నెల పాటు వాహనాలను జప్తు చేసింది. గతంలో అత్యవసర వాహనాలకు దారి ఇవ్వని వారికి Dh1000 జరిమానాతో పాటు 6 బ్లాక్ పాయింట్లు విధించేవారు. ఆంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు, పోలీస్ పాట్రోలింగ్ వాహనాలకు దారి ఇవ్వకపోవటం వల్ల రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరిగిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అందించేందుకు ఆలస్యం అవుతుందన్న విషయాన్ని దేశ పౌరులు, ప్రవాసీయులు గుర్తుంచుకోవాలని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. అందువల్ల ప్రతి వాహనదారుడు అత్యవసర వాహనాలకు విధిగా దారి ఇవ్వాలని కోరింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com