తల్లిదండ్రులపై భారం..స్కూల్ ఫీజులు మొత్తం కట్టాల్సిందే అంటున్న అబుధాబి పాఠశాలలు

- August 25, 2020 , by Maagulf
తల్లిదండ్రులపై భారం..స్కూల్ ఫీజులు మొత్తం కట్టాల్సిందే అంటున్న అబుధాబి పాఠశాలలు

అబుధాబి: కరోనా నడుమ కట్టుదిట్టమైన నిబంధనలతో స్కూళ్ళు తెరుచుకోనున్నాయి. పాఠశాలలు పలు ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించనున్నాయి; అనగా, విద్యార్థులు పూర్తి రోజు, సగం రోజు, ప్రత్యామ్నాయ రోజులు, ప్రత్యామ్నాయ వారాలు వంటి వివిధ అషన్స్ ను ఎంచుకోవచ్చు. కొందరు డిస్టెన్స్ లెర్నింగ్ కు ప్రాధమ్యమిస్తే మరికొందరు డిస్టెన్స్ లెర్నింగ్ మరియు ఇన్ క్లాస్ విద్యా విధాన్ని సంయుక్తంగా కోరుతున్నారు. మార్గం ఏదైనప్పటికీ విద్యార్థులు పూర్తిగా ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అబుధాబి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ (ADEK) సోమవారం ప్రకటన జారీ చేసింది. అలాగే బస్సు ఫీజులను సైతం చెల్లించాలి అని పేర్కొంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు మద్దతు కోసం వారి పాఠశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదించమని ADEK సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com