హైదరాబాద్: రూ.4 కోట్ల నిధులు సమీకరించిన ఫ్రీ హిట్ ఫాంటసీ
- August 25, 2020
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ 'ఫ్రీ హింట్ ఫాంటసీ' తమ వ్యాపార విస్తరణకు రూ.4 కోట్ల నిధులను సమీకరించింది. ఈ మొత్తాన్ని కంపెనీ అభివృద్ధికి వినియోగించి 2021 నాటికి 10 మిలియన్ల మంది వినియోగదారులను చేరువయ్యేలా వినియోగించనుంది. ఫ్రీ హింట్ ఫాంటసీ గేమింగ్ అప్లికేషన్ ఈ నెల 30 నుంచి ఐఓఎస్, ఆండ్రాయిడ్, వెబ్ లలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అయితే.. దేశంలోనే తొలిసారిగా కేవలం ఒక్క రూపాయితోనే ఖచ్చితమైన బహుమతులు గెలుచుకునేలా ఫాంటసీ గేమింగ్ అప్లికేషన్ వినియోగదారులను ఆకర్షించనుంది. పలు రాష్ట్రాల్లో విస్తరించేందుకు వీలుగా ప్రస్తుతానికి 8 భాషలలో అప్లికేషన్ రూపొందించారు. ఇదిలాఉంటే హైదరాబాద్ కు చెందిన ప్రత్యూష్ చౌదరి, తరుణ్ వర్మ దండు, రమణ కొవెలముడి ఫ్రీ హింట్ ఫాంటసీని స్థాపించారు. ఓ గేమింగ్ అప్లికేషన్స్ లో తెలుగు రాష్ట్రాల్లో ఇంతలా నిధులు సమీకరించిన తొలి కంపెనీ ఇదే కావటం విశేషం. అయితే..2023 నాటికి గేమింగ్ కంపెనీ 119 బిలియన్ల మార్కెట్ కు ఎదుగుతుందని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







