ప్రీ పెయిడ్‌ కార్డుల అక్రమ అమ్మకం: భారతీయ వ్యక్తి అరెస్ట్‌

- August 27, 2020 , by Maagulf
ప్రీ పెయిడ్‌ కార్డుల అక్రమ అమ్మకం: భారతీయ వ్యక్తి అరెస్ట్‌

సౌదీ: భారత రెసిడెంట్‌ ఒకరు, అక్రమంగా ప్రీ పెయిడ్‌ మొబైల్‌ ఫోన్‌ కార్డుల్ని అక్రమంగా విక్రయిస్తుండగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫారిన్‌ టెలికమ్యూనికేషన్స్‌ కంపెనీలకు చెందిన కార్డుల్ని నిందితుడు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మెదినా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ అధికార ప్రతినిది¸ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హుస్సేన్‌ అల్‌ కహ్తానీ మాట్లాడుతూ, 1 మిలియన్‌ రియాల్స్‌ విలువైన 47,500 కార్డుల్ని అలాగే, 77,766 రియాల్స్‌ నగదునీ నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి నిందితుడ్ని రిఫర్‌ చేసినట్లు తెలిపారు పోలీసులు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com