రస్‌ అల్‌ ఖైమాలో 50 శాతం ట్రాఫిక్‌ జరీమానా డిస్కౌంట్‌

- August 27, 2020 , by Maagulf
రస్‌ అల్‌ ఖైమాలో 50 శాతం ట్రాఫిక్‌ జరీమానా డిస్కౌంట్‌

యూఏఈ: ట్రాఫిక్‌ జరీమానాలపై 50 శాతం డిస్కౌంట్‌ని రస్‌ అల్‌ ఖైమా పోలీస్‌ ప్రకటించింది. సెప్టెంబర్‌ 1 నుంచి అక్టోబర్‌ 1 వరకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రమాదకరమైన రీతిలో వాహనాల్ని నడిపిన కేసుల్లో జరీమానాలకు ఈ డిస్కౌంట్‌ నుంచి మినహాయింపు వుంటుంది. వాటికి జరీమానా డిస్కౌంట్‌ వర్తించదు. ట్రాఫిక్‌ రూల్స్‌ని తప్పక పాటించాల్సిన బాధ్యత పౌరులపై వుంటుందనీ, జరీమానాలు విధించేది కేవలం ట్రాఫిక్‌ రూల్స్‌ పట్ల అవగాహన పెంచడం కోసమేనని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు. డిస్కౌంట్‌ని వినియోగించుకునే వాహనదారులు, మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌కి చెందిన స్మార్ట్‌ అప్లికేషన్స్‌ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. సమీపంలో వున్న సర్వీస్‌ సెంటర్‌ ద్వారా బ్లాక్‌ ట్రాఫిక్‌ పాయింట్స్‌ డ్యూ పొందవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com