ఏ.పి:బ్రాడ్ బ్యాండ్ సేవలు మరింత సులభతరం
- August 27, 2020
అమరావతి:కోవిడ్ -19 నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో మంచి నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి ఏపీకి వచ్చిన సాఫ్ట్ వేర్ ‘టెక్కీ'లు, ఉద్యోగుల కోసం బ్రాడ్ బ్యాండ్ సేవలు విస్తరించాలని రాష్ట్ర ఐ.టి శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి నిర్ణయించారు.
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు , వివిధ విభాగాల్లో ఆన్ లైన్, వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పనిచేసే ఉద్యోగులు కరోనా బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. అనుకోని పరిస్థితుల్లో కరోనా సోకినా ఏపిలో ఉంటే వైద్య సేవలు ప్రభావవంతంగా అందుతాయన్న ఉద్దేశంతో స్వంత రాష్ట్రానికి వచ్చి మరి ఐ.టీ ఉద్యోగులు వారి ఇంటి నుంచే తమ ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా విధులు నిర్వహిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు , వివిధ హోదాలో పనిచేసే ఉద్యోగులు ఇంటర్నెట్ సేవల విషయంలో ఇబ్బందులు పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఈ బ్రాడ్ బ్యాండ్ సేవలు పొందడానికి https://broadband.apit.ap.gov.in/ లింకు ద్వారా సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!