దుబాయ్ నుంచి ఎట్టకేలకు స్వదేశానికి చేరిన తెలంగాణ వాసి...
- August 28, 2020
దుబాయ్:5 ఏళ్ళ క్రితం ఓ యువకుడు దొంగచాటుగా ఒమన్ దేశ సరిహద్దులు దాటి దుబాయ్ వెళ్లాడు. జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం నాగునూర్ గ్రామానికి చెందిన జంగిలి పెద్దులు ఈ నెల 27న గురువారం దుబాయ్ నుండి ముంబై ద్వారా హైదరాబాద్ చేరుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే...జంగిలి పెద్దులుకొందరి మాటలు నమ్మి, ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లాడు. కరోనా మూలంగా అందరూ స్వదేశాలకు వెళ్తుండగా, పెద్దులు స్వదేశానికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. కాగా పెద్దులు సమస్య తెలిసిన దుబాయ్ కాన్సులేట్ అధికారులు పెద్దులుకు తాత్కాలిక పాస్ పోర్టు ఇప్పించారు.
అంతేగాకుండా అక్కడ పెద్దులుకు జైత నారాయణ(సోషల్ వర్కర్) సహకరించారు. భారతీయ పౌరుడు అని నిరూపించే పత్రాలను భారత్ నుంచి ప్రవాసి కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి పంపించారు. కరోనా నేపథ్యంలో ఇటీవల యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) పథకం ద్వారా ఇండియాకు చేరాడు. ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్న జంగిలి పెద్దులు మాట్లాడుతూ… మెరుగైన ఉద్యోగ అవకాశాలుంటాయన్న మాటలు నమ్మి అక్రమంగా దేశ సరిహద్దులు దాటడం తాను చేసిన పొరపాటని, ఈ విధంగా ఎవరూ చేయకూడదని అన్నాడు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







