యూఏఈ తో భారత్ మిస్సైల్ వ్యాపారం..వర్కౌట్ అవుతుందా?
- August 29, 2020
న్యూఢిల్లీ: అరబ్ దేశాలు క్రూడ్ ఆయిల్ సంపాదనతో విలాసవంతమైన జీవితాలను గడుపుతుంటాయి. కానీ.. వారి రక్షణ కోసం సొంతంగా ఆయుధాలను తయారుచేసే నైపుణ్యత వారికి లేదు. అందుకే అమెరికా, రష్యా నుండి ఆయుధాలను కొనుగోలు చేస్తుంటాయి. అయితే భారతదేశం కూడా ఇటీవలే ఆయుధ మార్కెట్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. భారత్ తయారుచేసిన బ్రహ్మోస్ క్షిపణులను ఇతర దేశాలకు అమ్మాలని నిర్ణయించింది. దీంతో వీటి కోసం ఇప్పటికే 5.5 బిలియన్ డాలర్ల ఆర్డర్లు వచ్చాయి. తాజాగా దుబాయ్ కూడా బ్రహ్మోస్ క్షిపణులను తమకు అమ్మాలని భారత్‌ను కోరుతుంది. నిజానికి దుబాయ్ భారత్‌కు మిత్రదేశం అయినప్పటికి అక్కడ కొన్ని ఉగ్రవాద సంస్థలు ఉండడం వల్ల వీటిని అమ్మలా.. వద్దా.. అని భారత ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఒకవేళ దుబాయ్ కి బ్రహ్మోస్ అమ్మితే పొరపాటున అవి ఉగ్రవాదుల చేతికి చిక్కి.. వారు ఇతర దేశాలపైకి ప్రయోగిస్తే దుబాయ్ సైన్యం నుండి ఉగ్రవాదులకు చేరాయి కాబట్టి ఉగ్రవాదులు దాడి చేసినప్పటికీ దుబాయ్ దాడి చేసినట్లుగా భావిస్తారు. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. అందుకే భారత ప్రభుత్వం దుబాయ్ కి బ్రహ్మోస్ అమ్మాకంపై తీవ్రంగా పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో దుబాయ్ రష్యాను భారత్ బ్రహ్మోస్ అమ్మేందుకు రికమండేషన్ చేయాలని కోరింది. భారత ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి...!!
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







