SCTPCsలు పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలి:సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్
- August 29, 2020
హైదరాబాద్: జ్ఞానం శక్తివంతమైనది. ఏఆర్ SCTPCs లు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నించాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., అన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లోని పరేడ్ గ్రౌండ్లో ఈరోజు అర్మెడ్ రిజర్వ్ (ఏఆర్) SCTPCs (స్టైపండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్)ల స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ – 2020 ప్రోగ్రామ్ కు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఐపీఎస్.,ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.
ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా/ guests of honour గా బ్యాడ్ మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివా రెడ్డి హాజరయ్యారు.ముందుగా SCTPCsల కవాతు అందరినీ ఆకట్టుకుంది. అనంతరం 100 మీటర్ల పరుగు పందెం నిర్వహించారు.
ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., మాట్లాడుతూ.. ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ అభినందనలు తెలిపారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ క్రీడల్లో పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. SCTPCs స్టైపండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్ బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ ఎలాంటి అవాంతరాలు లేకుండా నడుస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. సైబరాబాద్ సీటీసీ లో శిక్షణ పొందుతున్న 2020వ బ్యాచ్ కు చెందిన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ 4 యూనిట్ ల కు చెందిన 237 మంది ఏఆర్ SCTPCs లకు సంబంధించిన 9 నెలల బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అక్టోబర్ మొదటి వారంతో ముగియనుందన్నారు. SCTPCs వివిధ జిల్లాల్లో రిపోర్ట్ చేస్తారన్నారు. SCTPCs ట్రైనింగ్ ప్రోగ్రామ్ అక్టోబర్ మొదటి వారంతో ముగియనున్నందున వారిలో ఉత్సాహాన్ని, క్రీడా స్ఫూర్తిని నింపేందుకు, క్రీడా నైపుణ్యాన్ని పెంచేందుకు, ఆరోగ్య స్పృహను పెంపొందించేందుకు, భవిష్యత్తు లో వారికి ఒక మంచి జ్ఞాపకంగా ఉండేందుకు ఈరోజు SCTPCs స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ – 2020 ను ఏర్పాటు చేశామన్నారు. గత మూడు రోజుల నుంచి కొనసాగుతున్న స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ /క్లోజింగ్ సెర్మనీ నేటితో ముగియనుందన్నారు. ఈ స్పోర్ట్స్ లో పీసీలందరూ చక్కటి ప్రతిభ కనబర్చి వారి నైపుణ్యాలను చూపించారన్నారు. క్రీడలలో లా జీవితంలోనూ గెలుపోటములు సహజమన్నారు. గెలుపోటములను స్పోర్టివ్ గా తీసుకోవాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు.పెద్ద ఎత్తున పోలీస్ పోస్టులను భర్తీ చేసిందన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సైబరాబాద్ లోనూ అనేక మంది పోలీసు అధికారులు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో తమ సత్తా చాటారన్నారు. ప్రస్తుతం కూకట్పల్లి ట్రాఫిక్ అడిషనల్ సీఐ గా పని చేస్తున్న ఎన్ బోస్ కిరణ్, చైనా లోని చేంగ్ డూ లో నిర్వహించిన 2019 వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ లో 2 కాంస్య/bronze పథకాలను సాధించారన్నారు.
పోలీస్ వృత్తి ఉన్నతమైనదన్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న పీసీ లు వారి తల్లిదండ్రులు, సైబరాబాద్ సీటీసీ కి, వారు పని చేస్తున్న యూనిట్ కి, మొత్తం పోలీసు శాఖ కు మంచి పేరు తీసుకురావలన్నారు. పోలీసులు స్వీయ క్రమశిక్షణను పాటించాలన్నారు. పోలీసులు నిరంతరం ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. సివిల్, ఏఆర్ రెండు సమానమైనవేనన్నారు. పోలీసు వ్యవస్థకు ఏఆర్ సిబ్బంది వెన్నముక వంటిదన్నారు.
ట్రైనింగ్ సమయంలో ఇండోర్, అవుట్ డోర్ ట్రైనింగ్ లను సద్వినియోగం చేసుకున్నారన్నారు. అవుట్ డోర్ ట్రైనింగ్ లో భాగంగా యోగా, మెడిటేషన్, స్పోర్ట్స్, డ్రిల్, ట్యాక్టికల్ ట్రైనింగ్, మ్యాప్ రీడింగ్, జీపీఎస్, వెపన్ ట్రైనింగ్ తదితర యాక్టివిటీస్ లో తర్ఫీదునిచ్చామన్నారు.
ఇండోర్ ట్రైనింగ్ లో భాగంగా చట్టాలపై అవగాహన, లా అండ్ ఆర్డర్, సెక్యూరిటీ, పిటిషన్లు రాయడం, క్రైమ్ నంబర్లు, సెక్షన్ లు, పోలీస్ అడ్మినిస్ట్రేషన్, జెండర్ సెన్సిటైజేషన్, వ్యక్తిత్వ వికాసం, కంప్యూటర్ ట్రైనింగ్ తదితర అంశాలపై తర్ఫీదు పొందారన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా కు దూరంగా ఉండాలని హితవు పలికారు. ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి చేసి సైబరాబాద్ పోలీసులు, తమ తమ యూనిట్లకు మంచి పేరు తీసుకురావాలన్నారు.బ్యాడ్ మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును ఆదర్శంగా తీసుకొని జాతీయస్థాయిలో క్రీడల్లో రాణించాలని స్టూడెంట్ పోలీస్ క్యాడెట్స్ సూచించారు.
ఆటల్లో గెలుపోటములనేవీ సహజమన్నారు. గెలుపోటముల కంటే టీమ్ స్పిరిట్ గొప్పదన్నారు. క్రీడలు మనలో దాగున్న శక్తి సామర్థ్యాలను, పోరాట పటిమను వెలికి తీస్తాయన్నారు. పోలీసులు ఇదే స్ఫూర్తిని ప్రొఫెషన్ లోనూ చూపించాలి అన్నారు. మంచి జీవన విధానాన్ని/ life style ని అవలంబించాలన్నారు. స్టూడెంట్ పోలీస్ క్యాడెట్స్ (ఎస్పీసీ)లు పరేడ్ ను చక్కగా చేశారని అభినందించారు.
ట్రైనింగ్ లో ఉన్న ఫిట్నెస్ తర్వాత కూడా మెయింటెయిన్ చేయాలన్నారు. వ్యాయామానికి తగిన సమయం కేటాయించాలన్నారు.మానసిక ప్రశాంతతకు ధ్యానం చేయాలన్నారు. కరోనా విషయంలో ఆనవాస్రా భయాలు పెట్టుకోవద్దని, తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. సోషల్ డిస్టెన్స్, మాస్కులను వాడటం, శానిటైజర్ లను ఉపయోగించాలన్నారు. స్పోర్ట్స్ మీట్ లో పాల్గొన్న వారందరికీ మరొక్కసారి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం బ్యాడ్ మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మాట్లాడుతూ ఈ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలి. బాడీ ఫిట్నెస్ ఉంటే.. ఇమ్మ్యూనిటీ పెరిగి వైరస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చన్నారు. పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉన్నప్పటికీ సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం వారిలో నూతనోత్సాహాన్ని నింపుతుందన్నారు. పోలీసులు వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు. ఇలాంటి స్పోర్ట్స్ మీట్ ను ప్రతీ సంవత్సరం జరుపుకోవాలన్నారు. క్రీడలు నాయకత్వ లక్షణాలను తట్టి లేపడం తో పాటు టీమ్ స్పిరిట్, ఐకమత్యాన్ని పెంచుతాయన్నారు. క్రీడల్లో పాల్గొనే వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. క్రీడలు మానసిక స్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్నారు. క్రీడల్లో గెలుపు కంటే పాల్గొనడం/ పార్టీసిపేషన్ ముఖ్యమన్నారు. కష్టపడితేనే క్రీడల్లోనైనా, ఏ వృత్తి, రంగంలోనైనా మంచి ఫలితం ఉంటుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు, లా అండ్ ఆర్డర్ తో పాటు అనేక వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తున్నందుకు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్కి సెల్యూట్ అన్నారు.జాతీయస్థాయిలో మెడల్స్ సాధించాలని పోలీసులను కోరారు.
అనంతరం ఏడీసీపీ క్రైమ్స్/ సీటీసీ ప్రిన్సిపాల్ కవిత మాట్లాడుతూ కానిస్టేబుళ్లు క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై పని చేస్తారని.. పోలీస్ డెపార్ట్ మెంట్ లో వారి పాత్ర కీలకమన్నారు.. సీటీసీ ఇప్పటివరకు వివిధ స్థాయిల్లో అనేక మంది అధికారులకు ట్రైనింగ్ తీసుకున్నారన్నారు. ట్రైనీ కానిస్టేబుళ్లు విజయవంతంగా ట్రైనింగ్ పూర్తి చేసుకొని తెలంగాణ పోలీస్ వ్యవస్థకు వన్నె తేవాలన్నారు.
మిమిక్రీ ఆర్టిస్ట్ శివా రెడ్డి మాట్లాడుతూ పోలీసులు విధుల్లో ఒత్తిడి నుంచి బయటపడడానికి క్రీడలు తోడ్పడతాయన్నారు. పోలీసులు శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి క్రీడలు దోహదపడతాయన్నారు. పోలీసుల మానసికోల్లాసం కోసం స్పోర్ట్స్ మీట్ ను ఏర్పాటు చేసి తనను కార్యక్రమానికి ఆహ్వానించినందుకు సీపీ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమం చివరలో క్రీడల్లో గెలిచిన వారికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్., పీవీ సింధు, బహుమతుల అందజేశారు. బ్యాడ్ మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివా రెడ్డి కి శాలువా కప్పి సత్కరించి మెమొంటో ను అందజేశారు.
మిమిక్రీ ఆర్టిస్ట్ శివా రెడ్డి, అతని సోదరుడు కరోనా పై తీసిన షార్ట్ ఫిల్మ్ ను సీపీ సజ్జనార్ ఆవిష్కరించారు.సైబరాబాద్ పోలీస్ కళా బృందాల పాటలు ఆలోచింపజేశాయి. ట్రైనీ పోలీసుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మిమిక్రీ ఆర్టిస్ట్ శివా రెడ్డి తన అనుభవాలను పంచుకోవడంతో పాటు మిమిక్రీ చేసి అందరినీ నవ్వించారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఐపీఎస్., విమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అనసూయ, ఎస్ బీ ఏడీసీపీ గౌస్ మోహి యుద్దీన్, ఏడీసీపీ సీఎస్ డబ్లూ మాణిక్ రాజ్, ఏడీసీపీ సీఎస్ డబ్ల్యూ వెంకట్ రెడ్డి, మాదాపూర్ ఏడీసీపీ వెంకటేశ్వర్లు, ఏడీసీపీ ట్రాఫిక్ ప్రవీణ్ కుమార్,ఏడీసీపీ క్రైమ్స్/ సీటీసీ ప్రిన్సిపాల్ కవిత, ఏడీసీపీ అడ్మిన్ లావణ్య ఎన్ జెపీ, ఎస్ టీ ఎఫ్ ఏసీపీ శ్యామ్ బాబు, సీటీసీ ఏసీపీ/ వైస్ ప్రిన్సిపాల్ కిశోర్, సీటీసీ ఏసీపీలు వెంకట్ రెడ్డి, బాలకృష్ణ రెడ్డి, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏసీపీ లక్ష్మి నారాయణ, ఎస్టేట్ ఆఫీసర్ ఏసీపీ సంతోష్ కుమార్, సీటీసీ డాక్టర్లు సుకుమార్, సరిత, సిబ్బంది, ఇన్ స్పెక్టర్లు, ఆర్ఐ లు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..