బహ్రెయిన్:కోవిడ్-19 తో మరొకరు మృతి
- August 29, 2020
మనామా:కరోనా మహమ్మారి ధాటికి బహ్రెయిన్ లో మరొకరు మృతి చెందారు. 59 ఏళ్ల బహ్రెయిన్ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఇదిలాఉంటే.. నిన్నటి వరకు కరోనా కారణంగా 189 మంది చనిపోయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం బహ్రెయిన్ లో వైరస్ బారిన పడిన 65 మంది చికిత్స పొందుతున్నారని, వారిలో 30 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. మరోవైపు శుక్రవారం 9,651 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..357 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఇందులో 115 మంది ప్రవాసీయులు ఉన్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 10 లక్షల 88 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 47,760 మంది వైరస్ బారిన పడ్డారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?