భారత్ లో కరోనా కల్లోలం..
- August 30, 2020
న్యూ ఢిల్లీ:భారత్ లో గడిచిన 24 గంటల్లో ఏకంగా 79 వేల కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవడం దేశంలో ఇదే తొలిసారి. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇదో రికార్డు. జులై 25న అమెరికాలో ఒక్కరోజులో 78 వేల 427 కేసులు నమోదైతే ఇప్పుడు మన దగ్గర 78 వేల 903 కేసులు వచ్చాయి. USలో 76 వేలకుపైగా కేసులు పలు సందర్భాల్లో నమోదైనా.. ఈ వారం రోజుల నుంచే భారత్‌లో కరోనా మీటర్ మరింత పైపైకి వెళ్తోంది. ఈ వారం రోజుల వ్యవధిలోనే దేశంలో 4 లక్షల 96 వేల మంది అంటే దాదాపుగా 5 లక్షల మంది కోవిడ్ బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా ఇప్పటికి కరోనా కేసుల సంఖ్య 35 లక్షలు దాటేసింది. దేశవ్యాప్తంగా సగటున గత వారం రోజులుగా 70 వేల 867 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక నిన్న ఒక్కరోజే ఏకంగా 945 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..