ప్రశాంత్ భూషణ్కు శిక్ష ఖరారు
- August 31, 2020
న్యూ ఢిల్లీ:ప్రశాంత్ భూషణ్ కు సుప్రీంకోర్టు శిక్షను ఖరారు చేసింది. వివాదాస్పద ట్వీట్ల కేసులో ఆయనకు ఉన్నత న్యాయస్థానం ఒక రూపాయి జరీమానా విధించంచింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డేతో పాటు సుప్రీం న్యాయమూర్తులను విమర్శించిన ఈ మేరకు ఆయనకు శిక్ష పడింది. సెప్టెంబర్ 15వ తేదీలోగా ఆయన తన జరిమానా కట్టాలని.. లేని పక్షంలో ఆయనకు మూడు నెలల జైలు శిక్ష లేదా మూడు ఏళ్ల పాటు న్యాయవాద వృత్తిలో కొనసాగరాదు అని సుప్రీంకోర్టు తన తీర్పులో వెల్లడించింది. కాగా.. చీఫ్ జస్టిస్ సహా.. న్యాయమూర్తులపై ప్రశాంత్ భూషణ్ చేసిన వివాదాస్పద ట్వీట్లకు క్షమాపణలు చెప్పాలని సుప్రీం కోర్టు ఇటీవల కోరింది. అయితే, ఆయన మాత్రం దీనికి ససేమిరా అన్నారు. క్షమాపణలు చెప్పాలని రెండు సార్లు అవకాశం ఇచ్చినా.. ఆయన మాత్రం పంతం వీడలేదు. ఏ శిక్షకైనా సిద్ధంగా ఉంటా.. కానీ, క్షమాపణలు మాత్రం చెప్పనని తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఒక రూపాయి జరిమానా విధిస్తూ సుప్రీం కోర్డు తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ