కుప్పకూలిన భారత ఎకానమీ...ఎప్పటికి కోలుకుంటుందో!
- September 01, 2020
కరోనా దెబ్బకు భారత ఆర్థిక వృద్ధి రేటు కుప్పకూలింది. మైనస్‌లోకి వెళ్లింది. అది కూడా ఏకంగా మైనస్ 23.9గా అతి భారీ స్థాయిలో. వృద్ధిరేటు లేకపోగా ఈ స్థాయిలో మైనస్‌లోకి వెళ్లిపోవడం 40ఏళ్లలో ఇదే ప్రథమం. ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే కొంత ఊరటనిస్తోంది. మిగిలిన దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయి. వ్యవసాయ రంగం 3.4 శాతం వృద్దిరేటును నమోదు చేసింది.
రియల్టీ, ఫైనార్షియల్ రంగంలో క్షీణత మైనస్ 5.3శాతంగా ఉంది. వాణిజ్యం, హోటల్స్, కమ్యూనికేషన్లో ఈ పతనం మైనస్ 47 శాతంగా ఉంది. తయారీ రంగం మైనస్ 39.3 శాతానికి పడిపోయింది. నిర్మాణ రంగం అతిభారీగా దెబ్బతింది. ఈ రంగం క్షీణత మైనస్ 50.3 శాతంగా ఉంది. మైనింగ్ మైనస్ 23.3 శాతం, విద్యుత్, గ్యాస్ మైనస్ 7 శాతంగా క్షీణతను నమోదు చేశాయి.
జీడీపీ డేటా అందుబాటులో ఉన్న 1951 నుంచి చూస్తే 1958, 1966, 1967, 1973, 1980లో మైనస్ వృద్ధి రేటు నమోదు అయింది. 1980 తర్వాత ఇప్పుడే మళ్లీ జీడీపీ మైనస్‌ల్లోకి వెళ్లిపోయింది. ఆ ఆర్థిక ఏడాది మొత్తం మీద చూస్తే జీడీపీ పతనం మైనస్ 15 -20 శాతం మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- NATS ఆధ్వర్యంలో కాఫీ విత్ కాప్స్ ప్రజా భద్రత పై అవగాహన సదస్సు
- కువైట్ నుంచి విజయవాడకు జజీరా ఎయిర్వేస్ కొత్త విమాన సర్వీసులు
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది–ఈద్ మిలాప్ వేడుకలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!









