పోషకాహారంపై మరింత చైతన్యం అవసరం:తెలంగాణ గవర్నర్

- September 01, 2020 , by Maagulf
పోషకాహారంపై మరింత చైతన్యం అవసరం:తెలంగాణ గవర్నర్

హైదరాబాద్:పోషకాహార ఆవశ్యకతపై మరింత అవగాహన పెంచాలి, పోషకాహార లోపాలను నివారించేందుకు ప్రజలు మరింత చైతన్యవంతులు కావాలి అని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ అన్నారు. 

సరైన పోషకాహారంతో మాతా, శిశు మరణాలను చాలా వరకు తగ్గించవచ్చని గవర్నర్ తెలిపారు. 
‘పోషన్ అభియాన్’ అనే పథకం ద్వారా 9 వేన కోట్ల రూపాయల కేటాయింపు ద్వారా 2022వ సంవత్సరం వరకు పోషకాహార లోప రహిత దేశంగా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పించారని గవర్నర్ వివరించారు. 
పోషకాహార ఆవశ్యకత అవగాహనను పెంచడానికి జరుగుతున్న ప్రజా ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని డా. తమిళిసై పిలుపునిచ్చారు. 
శ్రీరామ చంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థ ద్వారా ఏర్పాటు చేసిన “జాతీయ పోషకాహార మాసం” కార్యక్రమంలో ఈరోజు గవర్నర్ ముఖ్య అతిధిగా వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా పాల్గొన్నారు. 
కోవిడ్-19 మానవ జీవితంలో రోగనిరోధక శక్తి ఎంత కీలకమో మరోసారి తెలియజెప్పింది. ప్రజలు కోవిడ్ నిరోధక ఆహారపు అలవాట్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 
చదువుకున్న తల్లితండ్రులు కూడా తమ పిల్లలకు జంక్ ఫుడ్ ఇవ్వడం ఆందోళన కలిగించే అంశం. దీని ద్వారా వారు అనేక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని గవర్నర్ వివరించారు. 
తనకు చిన్నప్పుడు తన అమ్మమ్మ బెల్లంతో చేసిన కొన్ని చిరు తిండ్లు ఇచ్చేదని, అవి ఆరోగ్యకరమైన సంప్రదాయ అలవాట్లని గవర్నర్ తన బాల్యాన్ని గర్తు చేసుకున్నారు. 
ఆరోగ్యకరమైన కూరగాయలను పండించుకోవడానికి అవకాశమున్న చోట కిచెన్ గార్డెన్ అభివృద్ధి చేసుకోవాలని డా. తమిళిసై పిలుపునిచ్చారు. 
దేశానికి ఆహార భద్రతతో పాటు, పోషకాహార భద్రత కూడా ఉండాలని డా. తమిళిసై తెలిపారు. 
తెలంగాణలో కెసిఆర్ కిట్, తమిళనాడులో అమ్మ బేబీ కేర్ కిట్ లతో హాస్పిటల్స్ లో సురక్షిత ప్రసవాలు పెరుగుతున్నాయి. ఈ విధంగా మాతా, శిశు మరణాలు కూడా తగ్గుతున్నాయని గవర్నర్ వివరించారు. 
శ్రీరామ చంద్ర ఇనిస్టిట్యూట్ వైస్-ఛాన్సలర్ ప్రొ. పి. విజయ రాఘవన్, ప్రిన్సిపాల్ డా. సెంథిల్ కుమార్, క్లినికల్ న్యూట్రీషన్ విభాగం హెడ్ డా. ఎజె హేమ మాలిని తదితరులు వెబినార్ లో ప్రసంగించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com