సౌదీ అరేబియా:అనైతిక చర్యలకు పాల్పడ్డ డాక్టర్‌పై సస్పెన్షన్ వేటు
- September 02, 2020రియాద్:ఓ కాస్మొటిక్ సర్జన్‌ని సస్పెండ్ చేస్తూ సౌదీ హెల్త్ అథారిటీస్ ఆదేశాలు జారీ చేశాయి. నిందితుడు, పేషెంట్ల ప్రైవేట్ పార్ట్స్‌ని చిత్రీకరించి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు అథారిటీస్ గుర్తించాయి. ‘మెడికల్ ఎది¸క్స్కి విరుద్ధమైన సంఘటన ఇది..’ అంటూ నిందితుడి వ్యవహరించిన తీరుపై అథారిటీస్ ఆగ్రహం వ్యక్తం చేశాయి. మెడికల్ ఎది¸క్స్ని ఉల్లంఘించినందుకుగాను నిందితుడిపై సస్పెన్షన్ వేటు విధించినట్లు మినిస్ట్రీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పేర్కొంది. అయితే, ఆ డాక్టర్ పేరునిగానీ, జాతీయతనుగానీ, వయసునిగానీ ప్రకటించలేదు. సౌదీ అరేబియాలో మెడికల్ మిస్ కండక్ట్ తీవ్రమైన నేరం. 10,000 సౌదీ రియల్స్ వరకూ జరీమానా విధించే అవకాశం వుంటుంది ఇలాంటి కేసుల్లో. ప్రాక్టీస్ లైసెన్స్‌ని కూడా రద్దు చేస్తారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు